ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!

- February 23, 2026 , by Maagulf
ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!

దోహా: త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్ ఓల్డ్ దోహా పోర్టులో ప్రారంభమైంది.  ఈ ఫెస్టివల్ కు హాజరవుతున్న సందర్శకులను ఖతార్  చారిత్రక వంటకాలు , ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి తెల్లవారుజాము వరకు ఈ ఫెస్టివల్  జరుగుతుంది.     

ఇక్కడ ఫుడ్ కోర్టులలో చెఫ్‌లు స్థానిక వంటకాలను సాంప్రదాయ పద్ధతిలో వేడివేడిగా అందిస్తున్నారు. సందర్శకులు తాజాగా తయారుచేసిన వంటకాలను ఆస్వాదిస్తూ, ఫెస్టివల్ సాంస్కృతిక ప్రదర్శనలను ఎంజాయ్ చేయవచ్చని నిర్వాహికులు ప్రకటించారు. అలాగే, ప్రతిరోజు ఫ్యామిలీస్, పిల్లల కోసం ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రమదాన్ థీమ్ తో నిర్వహిస్తున్న ఫెస్టివల్ అందరిని ఆకట్టుకుంటుందని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com