అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 23, 2026
మస్కట్: ఒమన్‌లోని అన్ని భారతీయ కాన్సులర్, పాస్‌పోర్ట్ మరియు వీసా సేవలకు దరఖాస్తుకు OMR 6 ఫిక్సుడ్ ఛార్జీలు వర్తిస్తాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను జారీ చేసింది.
సుల్తానేట్‌లోని భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ మరియు వీసా సేవలకు SGIVS గ్లోబల్ సర్వీసెస్ (SGIVS) ఏకైక ఆథరైజ్ సర్వీస్ ప్రొవైడర్ అని రాయబార కార్యాలయం తెలిపింది. రాయబార కార్యాలయం తరపున దరఖాస్తులను స్వీకరించడానికి మరే ఇతర ఏజెన్సీ లేదా సంస్థకు అనుమతి లేదని పేర్కొంది.
ఒమన్ వ్యాప్తంగా 11 దరఖాస్తు కేంద్రాలను నిర్వహిస్తున్న SGIVS, దాని ఏ కేంద్రాలలోనైనా సమర్పించిన ప్రతి దరఖాస్తును స్వీకరిస్తుందని వెల్లడించారు. ఇక పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు ఫోటోలను తీసుకురావాల్సిన అవసరం లేదని రాయబార కార్యాలయం తెలిపింది. SGIVS ప్రతి దరఖాస్తు కు సంబంధించి కేంద్రాలలోనే ఫోటోలను నేరుగా తీసుకుంటారని వెల్లడించారు. మరింత సమాచారం లేదా ఫిర్యాదులను [email protected] కు మెయిల్ చేయవచ్చని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్‌ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









