ప్రొ కబడ్డీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పట్నా పైరేట్స్

- July 31, 2016 , by Maagulf
ప్రొ కబడ్డీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పట్నా పైరేట్స్

ప్రొ కబడ్డీ లీగ్‌ - 4 ఫైనల్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై పట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. దాదాపు ఐదు వారాలుగా అభిమానులను అలరించిన కబడ్డీ టైటిల్‌ను పట్నా పైరేట్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 37-29తో పట్నా గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌ను రెండు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా పట్నా రికార్డు సృష్టించింది.అంతకు ముందు మహిళల ప్రొ కబడ్డీ లీగ్ -1 ఫైనల్‌ మ్యాచ్‌లో ఫైర్‌బర్డ్స్‌ పై స్టార్మ్‌క్వీన్స్‌ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కఠంగా జరిగిన మ్యాచ్‌లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. 22-23తో వెనకబడివున్న సమయంలో స్టార్మ్‌క్వీన్స్‌ రైడర్‌ తేజస్విని అద్బుత ఆట తీరును ప్రదర్శించింది. చివర్లో తేజస్విని రెండు పాయింట్లు సాధించి స్టార్మ్‌క్వీన్స్‌కు 24-23తో విజయాన్ని అందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com