అగర్తల బ్రాడ్‌గేజ్ రైల్వేలైను ప్రారంభించిన రైల్వేమంత్రి సురేష్‌ప్రభు
- July 31, 2016
దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ నేడు ప్రారంభమైంది. కేంద్ర రైల్వేమంత్రి సురేష్‌ప్రభు జెండా వూపి దీనిని ప్రారంభించారు. దీంతో అగర్తల-న్యూదిల్లీ త్రిపుర సుందరీ ఎక్స్‌ప్రెస్ దిల్లీ బయల్దేరింది. దీంతో దేశంలోని బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్ మ్యాప్‌లో త్రిపురకు కూడా స్థానం దక్కింది. అగర్తల నుంచి బంగ్లాదేశ్‌లోని అఖౌరా ప్రాంతానికి రైల్వేలైన్ నిర్మాణానికి రైల్వే మంత్రి సురేష్ ప్రభు, బంగ్లాదేశ్‌కు చెందిన మంత్రి ముజుబుల్ హక్‌లు సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ మార్గంలో త్రిపుర సుందరీ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక్క నడుస్తుంది. ఆదివారం బయల్దేరి 47గంటల తర్వాత దిల్లీకి చేరుకుంటుంది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







