నూనెలు హెల్త్ కి అంత మంచివికాదు...

- July 31, 2016 , by Maagulf
నూనెలు హెల్త్ కి అంత మంచివికాదు...

నూనె ఎక్కువగా దట్టించిన దోసెలు, చపాతీలు..ఇలా టిఫిన్స్ లాగించేయడం పాతమాటే. అయితే ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు నేటి తరం. అయితే, డిష్ టేస్టీగా ఉండాలంటే, తగిన మోతాదులో నూనె వాడాల్సిందే. ప్రస్తుతం మార్కెట్లోని టిఫెన్ సెంటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్ లలో వాడే నూనెలు హెల్త్ కి అంత మంచివికాదంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లోకూడా మార్కెట్లో చౌకగా దొరికే పలు రకాల ఆయిల్స్ వాడ్డం కూడా పొరపాటే అంటున్నారు. మనమంతా జనరల్ గా వాడే సోయాబీన్, మొక్కజొన్న నూనె, పత్తిగింజ(కాటన్) నూనెలతో లాభం లేదంటున్నారు.ఈ నూనెల తయారీ చాలా ప్రాసెస్ తో కూడుకుందని, వీటిలో కొవ్వుపదార్థాలు కూడా అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఫలితంగా గుండె జబ్బులు ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉందంటున్నారు. వీటికి బదులుగా వంటలో కొబ్బరి, అవెకాడో వంటి నూనెలు బెటరంటున్నారు. వీటిలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయని ఫలితంగా అధిక బరువు, గుండె జబ్బులు వచ్చేందుకు ఆస్కారం లేదంటున్నారు.ఇక పలురకాల సూప్స్ తయారీలో వాడే చికెన్ ఆయిల్స్ లో ఆకలి పుట్టించే పర్ సోడియం ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అధిక భరువు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందంటున్నారు. వీటికంటే, వెజిటబుల్ నూనెలతో సూప్స్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. గుండె బాగా పనిచేసేందకు ఇవి ఎంతో ఉపయోగపడతాయంటున్నారు.ఇక వనస్పతి లో గుండెకు హానికలిగించే కొవ్వు ఆమ్లాలు ఉన్నాయని వీటిని వాడడం మంచిదికాదని ఇసాబెల్ స్మిత్ న్యూట్రిషన్ స్థాపకుడు ఇసాబెల్ స్మిత్ అంటున్నారు. వీటి వల్ల స్థూలకాయం(ఒబిసిటీ), మధుమేహం(డయాబెటిస్), గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ప్రకృతి సిద్దమైన నూనెల వాడడం వల్ల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com