‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన
- February 28, 2026
తమ భూభాగం పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడులపై ఇరాన్ నిప్పులు చెరిగింది. ఈ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, తగిన సమయంలో గట్టి బుద్ధి చెబుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ ఈ పరిణామాలపై స్పందిస్తూ అంతర్జాతీయ సమాజానికి కీలక సంకేతాలు పంపారు. ఈ హెచ్చరికలతో మధ్యప్రాచ్య (Middle East) ప్రాంతంలో యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
‘యుద్ధాన్ని మీరు ప్రారంభించారు, మేం ముగింపు పలుకుతాం. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుంది’ అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ యొక్క దృఢమైన వైఖరిని తెలియజేస్తున్నాయి, ఇది మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది. ఇరాన్ తన ప్రతిస్పందన ద్వారా ప్రాంతీయ భద్రతపై ప్రభావం చూపనుంది.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.. ఏకంగా ఖమేని కార్యాలయం దగ్గరలో క్షిపణి దాడి జరిగింది. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, ఆఫీసు సమీపంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే దాడులకు ముందే ఖమేని బంకర్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుందన్నారు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు దాడులు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే దాడులు చేస్తున్నామన్నారు ట్రంప్.
తాజా వార్తలు
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!









