జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!

- March 01, 2026 , by Maagulf
జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!

జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!

దుబాయ్: జెబెల్ అలీ పోర్టులోని ఒక బెర్త్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి డ్రోన్ శిథిలాలే కారణం అని దుబాయ్ అధికారులు తెలిపారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు వెంటనే స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారని పేర్కొన్నారు.ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.

కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో 2021, జూలై 7 నాటిదని, ఇక అలాంటి పాత వీడియోను ప్రసారం చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. ఇరాన్ చేసిన డ్రోన్ దాడి సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే,  తప్పుడు వీడియోలను షేర్ చేయడం ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారవుతారని హెచ్చరించారు.  అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే సమాచారాన్ని పొందాలని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com