నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- March 02, 2026
కువైట్: కువైట్ లోని నేషనల్ పెట్రోలియం కంపెనీ (KNPC) మరియు కువైట్ ఇంటిగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ (KIPIC) లకు చెందిన అల్-అహ్మది రిఫైనరీపై ఇరాన్ దాడి చేసిందని వాటి అధికారిక ప్రతినిధి ఘనేమ్ అల్-ఒతైబి తెలిపారు. డ్రోన్ లేదా మిస్సైల్ శిథిలాలు పడి ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయని వెల్లడించారు. గాయపడిన ఉద్యోగులను చికిత్స కోసం అల్-అదాన్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
అయితే, రిఫైనరీ ఉత్పత్తి మరియు కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని తెలిపారు. రెస్క్యూ టీమ్స్ సమస్యను వెంటనే పరిష్కరించాయని అన్నారు. సిబ్బంది మరియు సౌకర్యాలను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మినా అల్-అహ్మది రిఫైనరీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుందని, కార్మికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- అందుబాటులోకి ఖతార్ బోట్ షో 2026 టికెట్లు.. ధరలు ఇవే..!!
- పెళ్లి రద్దు.. మహిళకు Dh60,000 జరిమానా..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. సలాలా ఎయిర్పోర్ట్కు పోటెత్తిన ప్రయాణికులు..!!
- కువైట్లో ప్రభుత్వ ఉద్యోగులపై తగ్గిన దాడులు..!!
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు







