పెళ్లి చూపులు చిత్రం చాలా బాగుoది : రాజమౌళి...

- July 31, 2016 , by Maagulf
పెళ్లి చూపులు చిత్రం చాలా బాగుoది :  రాజమౌళి...

పెళ్లి చూపులు చిత్రం చాలా బాగుందని అన్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆదివారం ఈ మూవీ చూసిన ఆయన.. సినిమా ముగిశాక కూడా సన్నివేశాలన్నీ తన చుట్టూనే తిరుగుతున్నాయన్న అనుభూతి కలుగుతోందని పేర్కొన్నాడు.తరుణ్ భాస్కర్ డైరెక్షన్, నటీ నటుల యాక్టింగ్..ఇలా అన్ని విషయాల్లో బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చిన ఈ మూవీకి హ్యాట్స్ ఆఫ్ అని జక్కన్న పేర్కొన్నాడు. ఇలాంటి చిన్న సినిమాలకు ఇంకా ఎక్కువ థియేటర్లు అవసరమని ఆయన అభిప్రాయపడ్డాడు. ఫ్రెష్ రొమాంటిక్ మూవీగా విడుదలైన పెళ్లి చూపులు లో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా నటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com