పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో హెరాయిన్ అక్రమరవాణా ..

- July 31, 2016 , by Maagulf
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో హెరాయిన్ అక్రమరవాణా ..

విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమరవాణా చేస్తూ పట్టుబడే వ్యక్తులను సధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే ఎయిర్ లైన్స్ సిబ్బందే అక్రమరవాణాకు పాల్పడితే..! అదే జరిగింది పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)కు చెందిన 12 మంది సిబ్బంది హెరాయిన్ అక్రమరవాణా చేస్తూ ఆదివారం పట్టుబడ్డారు. లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్(ఎఎన్ఎఫ్).. విమానం టాయ్ లెట్ లో 6 కిలోల హెరాయిన్ ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. .తమ సిబ్బంది 12 మంది అరెస్టు అయిన విషయాన్ని పీఐఏ స్పోక్స్ పర్సన్ డానియల్ గిలానీ ధృవీకరించారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పీఐఏ సిబ్బంది ఇటీవల డ్రగ్స్, సిగరెట్లు, అక్రమ పాస్ పోర్ట్ లు, మొబైల్ ఫోన్ లు తరలిస్తూ పట్టుబడటం సర్వసాధారణంగా మారింది. అయితే.. ఒకేసారి ఎక్కువ మొత్తంలో సిబ్బంది ప్రమేయం ఉడటం కలకలం సృష్టిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com