తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..
- July 31, 2016
ఈశాన్య, వాయవ్య దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కదులుతోంది. వీటి ప్రభావంతో సోమవారం ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ఏర్పడ్డాక ఉత్తర కోస్తాలో ఆదివారం సాయంత్రం నుంచే ఉరుములు, మెరుపులతో వర్షాలు మొదలయ్యాయి. ఇవి క్రమంగా పెరిగే వీలుందని అధికారులు వెల్లడించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశకు వస్తే ...కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో తీరం వెంబడి పడమటి దిశగా గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నందున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. పెద్దాపురంలో అత్యధికంగా 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







