భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- March 03, 2026
యూఏఈ: యూఏఈలో పరిస్థితులు బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆందోళనకరంగా లేదని, ప్రశాంతంగా ఉందని, యూఏఈ నాయకత్వం పై నమ్మకం ఉందని పలువురు యూఏఈ నివాసితులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆందోళనకరమైన వీడియోలకు వ్యతిరేకంగా తమ గళం విప్పారు.
“ఏమీ జరగడం లేదని మేము చెప్పడం లేదు.ప్రతిదీ బాగానే ఉంది.అందంగా ఉంది. బయట వైరల్ అవుతున్న వీడియోలలో చూపినంత భయంకరంగా ఏమీ లేదు. ” అని అబుదాబిలో ఉన్న కమ్యూనికేషన్ డైరెక్టర్ మొహమ్మద్ దక్కాక్ అన్నారు.
యూఏఈలో రోజువారీ జీవితం సాఫీగా కొనసాగుతున్నప్పటికీ, మీడియా కవరేజ్ మరియు వైరల్ పోస్టులు స్వదేశాలలో ఉన్న కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో అనవసరమైన భయాందోళనలకు కారణమవుతుందని దక్కాక్ అన్నారు.
బిస్కట్స్ & మోర్ వ్యవస్థాపకురాలు మరియు ఇద్దరు చిన్న పిల్లల తల్లి అయిన షాహెద్ మార్దిని కూడా స్పందించారు. అత్యంత బాధ కలిగించే విషయం ఏంటంటే తాను స్థానికంగా చూసినది కాదని, విదేశాల నుండి వస్తున్న మెసేజులని పేర్కొన్నారు. “నా తల్లి డమాస్కస్ నుండి నాకు ఫోన్ చేసి, ఇన్స్టాగ్రామ్లో అబుదాబిలో పేలుళ్లు చూశానని చెప్పింది,” అని మార్దిని చెప్పారు. ఏమీ లేదు. మేము పిల్లలతో మాల్లో ఆడుకుంటున్నామని తాను ఆమెకు భరోసా ఇచ్చాను అని తెలిపారు.
అయితే, ముఖ్యంగా నోటిఫికేషన్ల అలారం, శబ్దాలు వినగానే పిల్లలు భయపడుతున్నారని ఆమె అంగీకరించింది. కానీ పరిస్థితి త్వరగా మారిందని అన్నారు. “మొదట్లో మేము భయపడ్డాము. కానీ పాఠశాలలు ఆన్లైన్లోకి మారాయి. కొంతమంది ఇంటి నుండి పనిచేస్తున్నారు. అది మాత్రమే నిజమైన మార్పు.” అని పేర్కొన్నారు.
గతంలో లెబనాన్లో 2006 యుద్ధంలో ప్రథమ చికిత్స శిక్షకురాలిగా పనిచేసిన మునా తమీమ్ తన ఎస్ఎంలో స్పందించారు. "లెబనాన్లో ఉండగా భవనాలపై బాంబులు పడ్డాయి. మా ముందు మొత్తం నిర్మాణాలు కూలిపోయాయి. ఇక్కడ, అలాంటిదేమీ లేదు. మీరు ఒక శబ్దాన్ని వింటారు, ఆపై దానిని మరిచిపోయి పనుల్లో నిమగ్నం అవుతారు. " అని ఆమె పేర్కొన్నారు.
"మూడవ ప్రపంచ యుద్ధం" గురించి మాట్లాడటం సహా సోషల్ మీడియాలో కొన్ని అత్యంత తీవ్రమైన కథనాలు అబుదాబిలోని రోజువారీ జీవితానికి చాలా తక్కువ పోలికను కలిగి ఉన్నాయని ఆమె తెలిపారు. వాస్తవంగా బయట ఏమీ లేకుండానే మీడియా టీ కప్పులో తుఫానును సృష్టిస్తోందని అమె అభిప్రాయపడ్డారు.
మాల్స్, దుకాణాలు మరియు రోడ్లు తెరిచి ఉన్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ సమావేశాలు మరియు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారని అనేక మంది నివాసితులు వెల్లడించారు.
అదిగో యుద్ధం అంటూ ఆందోళనను పెంచడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించిందని సిరియాకు చెందిన అబుదాబి నివాసి తారెక్ సుక్కర్ అన్నారు. “సోషల్ మీడియా ప్రతిదీ ఎక్కువ చేసి చూపిస్తుంది. ప్రపంచం అంతం అవుతుందని అనిపించేలా కథనాలను ప్రసారం చేస్తున్నారు. వాటిని నమ్మకుండా బయటికి వెళ్ళినప్పుడు, ప్రతిదీ సాధారణమే అని అనిపిస్తుంది.” అని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతూనే ఉండటంతో నివాసితులు తమదైన శైలిలో పోస్టులతో వాతావరణాన్ని తేలికగా చేసే ప్రయత్నం చేయడం పై పలువురు హర్హం వ్యక్తంచేస్తున్నారు.భయాందోళనలు ఉన్నా జీవితం ఆగలేదు అని పలువురు పేర్కొన్నారు. ఇప్పడిప్పుడే ఈ వాతావరణానికి అలవాటు పడుతున్నామని, తాము అప్రమత్తంగా ఉన్నామని, జీవించడం కొనసాగిస్తున్నట్లు పలువురు నివాసితులు తమ అనుభవాలను షేర్ చేశారు.
తాజా వార్తలు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!









