'బంతిపూల జానకి' గీతాలు విడుదల

- July 31, 2016 , by Maagulf
'బంతిపూల జానకి' గీతాలు విడుదల

ధ న్‌రాజ్‌, దీక్షాపంత్‌, షకలక శంకర్‌, వేణు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బంతిపూల జానకి'. నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకుడు. కళ్యాణి - రామ్‌ నిర్మాతలు. బోలె అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని ప్రముఖ కథానాయకుడు రామ్‌ ఆవిష్కరించారు. ''నా కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకొన్నది రామ్‌. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంద''న్నాడు ధన్‌రాజ్‌. ''బోలే అందించిన పాటలు బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుంది. చిత్రబృందం అందించిన సహకారాన్ని మర్చిపోలేన''న్నారు దర్శకుడు. కార్యక్రమంలో రెజీనా, నందినిరెడ్డి, గీత రచయిత కాసర్ల శ్యామ్‌, సంపూర్ణేష్‌బాబు, అభిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com