వాట్స్ అప్ 'మరణం ముప్పు' సందేశం దుబాయ్ లో తల్లిని కుమారుడు వెంటాడుతోంది
- August 01, 2016
దుబాయ్: సామాజిక మాధ్యమాలు లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నాయి అని చెప్పడానికి ఈ ఉదంతం అద్దం పడుతుంది, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ లేకపోవడం, వారి వయస్సుకు తగినట్లుగా కాక అనవసరమైన ఎలెక్ట్రానిక్ ఉపకరణాలు పిచ్చి ప్రేమతో ఇచ్చి ఆపై పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుబాయ్ లో ఒక తల్లికి ఇదే అనుభవం ఎదురైంది. తన 11 ఏళ్ల కుమారుడికి వాట్స్ అప్ నుంచి ఒక సందేశం మెసేజ్ రూపంలో వచ్చిందని, అందులో మరణం ముప్పు గూర్చి ఉన్న విషయానికి తన బిడ్డ విపరీతంగా భయభ్రాంతులకు గురి కాబడుతున్నాడని లబోదిబోమంటుంది. దుబాయికి చెందిన బ్లాగర్ అయిన ప్రవాస భారతీయరాలు హర్షిక దర్యాణాని , గత మే నెలలో ఒక శుక్రవారం ఉదయం ఆమె కుమారుడు కేకలు పెడ్తూ తన బెడ్ రూమ్ తలుపు బాదుతూ నిద్ర లేపినట్లు చెప్పారు. జె అని ఆప్యాయంగా పిలవబడే ఆమె కుమారుడు తన గదిలో నిద్ర పోయేందుకు వెళ్ళాడు..వెనువెంటనే నిన్ను చంపుతామని తెరెసా ఫైడల్గో అనే ఒక వ్యక్తి నుండి వాట్స్ అప్ సందేశాన్ని అందుకోవడం జరిగింది. జె తనంతట తాను స్వయంగా గూగుల్ ద్వారా వెతుక్కున్న స్నేహితుడైన తెరెసా ఫైడల్గో ఆ సందేశాన్ని పంపడమే కాక " నిన్ను చంపుతామనే ఈ మరణ సందేశం నీవు నమ్మకపోతే, ఆ ఫలితం మరింత దారుణంగా ఉంటుందని నొక్కి చెప్పడంతో 11 ఏళ్ళ బాలుడు భయపడటం జరిగింది. తెరెసా ఫైడల్గో సామాజిక మీడియా ద్వారా గొలుసు సందేశాలు పలువురికి పంపడం , రక్తాలు ఓడే భయానక చిత్రాలు చూపించి తన పైత్యాన్ని బలహీన మనస్తత్వాలవారికి పంపి రాక్షస ఆనందం పొందే వ్యక్తి అంతేకాక తాను పంపిన భీకర సందేశాలు చక్కర్లు కొట్టేలా నెట్ జన్లను చేసుకోగల దిట్ట. ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన అమ్మాయికి సంబంధించిన ఒక కధని తన స్నేహితుల అందరికి వాట్స్ ఆప్ సందేశం ద్వారా పంపించాడు. ఈ కధని చదివి ఉరుకోకూడదని, ఆమె మరణం గూర్చి వేరే వేరే వారికి గొలుసు సందేశం ద్వారా పంపించాలని , అలా చేయనివారిని కారు ప్రమాదంలో చనిపోయిన ఆమె దెయ్యం రూపంలో వచ్చి నిర్ధాక్షిణ్యంగా చంపుతుందని ఇందులో వర్ణించబడింది. ఈ దయ్యం సందేశం ఫేస్బుక్, వాట్స్ అప్ , ఇంస్టాగ్రామ్ మరియు ఇమెయిల్ ఖాతాలో ఊపందుకున్నాయి దర్యాణాని పిల్లల ఆన్లైన్ జీవితాలను పై ఒక కన్ను ఉంచాలని తల్లిదండ్రులు కోరారు పిల్లలు తమ ఇష్టాలని లేదా తల్లిదండ్రుల తెలియకుండా, యుక్త వయస్సులో ఇటువంటి చేష్టలు మొదలుపెడతారని తెలిపారు.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







