ఓపెన్‌ హౌస్‌ నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

- August 01, 2016 , by Maagulf
ఓపెన్‌ హౌస్‌ నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

ఇండియన్‌ ఎంబసీ ఓపెన్‌ హౌస్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా అత్యవసర కాన్సులర్‌ మరియు కార్మిక సమస్యలు, అలాగే భారతీయులు ఖతార్‌లో ఎదుర్కొంటున్న సమస్యలు, కేసులపై బాధితుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. నెలవారీ ఓపెన్‌ హౌస్‌ సందర్భంగా ఇండియన్‌ ఎంబసీ, 2,419 ఫిర్యాదుల్ని స్వీకరించినట్లు వెల్లడించింది. అంబాసిడర్‌ సంజీవ్‌ అరోరా, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ ఆర్‌కె సింగ్‌, ఇతర అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఖతార్‌ గవర్నమెంట్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఇండియన్‌ కమ్యూనిటీ బెనెవోలెంట్‌ ఫోరమ్‌ (ఐసిబిఎఫ్‌) అధ్యక్షుడు అరవింద్‌ పాటిల్‌ ఈ ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం సెంట్రల్‌ ప్రిజన్‌ని, మరియు డిపోర్టేషన్‌ సెంటర్‌ని ఈ వారం సందర్శించింది. మొత్తం 133 మంది భారతీయులు ప్రిజన్‌లో ఉన్నారు. 100 మంది డిపోర్టేషన్‌ సెంటర్‌లో ఉన్నారు. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంది. 2015లో లేబర్‌ అండ్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ సెక్షన్‌ 4,132 ఫిర్యాదుల్ని తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2,419 ఫిర్యాదులను అందుకుంది. ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 161. 2015లో ఈ సంఖ్య 279గా ఉంది. ఈ ఏడాది మొత్తం 15 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను జారీ చేసిందనీ, అలాగే 11 టిక్కెట్లను భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్ళేందుకు జారీ చేశామని ఎంబసీ వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com