యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- March 05, 2026
యూఏఈః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల అత్యవసర సమావేశంలో ఆపరేషన్స్ రూమ్ అధికారులతో పాటు క్రైసిస్ మేనేజ్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ అబ్దులాజీజ్ అల్ అహ్మద్ ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత పరిస్థితులు, వివిధ అత్యవసర సవాళ్లను పరిష్కరించడంలో ఉమ్మడి ప్రయత్నాలను సమీక్షించారు.
అలాగే, సభ్య దేశాలలో భద్రతా పరంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. గల్ఫ్ అంతటా సంక్షోభం మరియు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల సంసిద్ధతను పెంచే లక్ష్యంతో పనిచేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎదురవుతున్న అత్యవసర సవాళ్లను పరిష్కరించడానికి సమాచార షేరింగ్ కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









