మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలు ఖాళీ చేయండి!
- August 01, 2016
ఉత్తరప్రదేశ్‌లోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాల్లో ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పింది. అలా ఉంటున్న వారు రెండు నెలల్లోగా బంగ్లాలు ఖాళీ చేయాలని ఆదేశాలిచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాల్సి ఉంది.
2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న.. ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనతో యూపీ మాజీ ముఖ్యమంత్రులు కల్యాణ్ సింగ్, ఎన్డీ తివారీ కూడా అధికారిక బంగ్లాలు వీడాల్సి ఉంది. మాజీ సీఎంలు అధికారిక బంగ్లాల్లోనే ఉండడాన్ని వ్యతిరేకిస్తూ లఖ్‌నవూకు చెందిన ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







