డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- March 05, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 216 అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో మార్చి 18, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.
ఏయే పోస్టులకు ఏయే అర్హతలు ఉండాలంటే..
- అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టూరిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ/సీఎంఏతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
- అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎల్ఎల్బీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
- రేడియో గ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్‌తోపాటు రేడియోగ్రఫీలో డిప్లొమా/సర్టిఫికేట్/బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- పట్వారీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో 28 మార్చి 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల ద్వారా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పోస్టును బట్టి రూ.18,000 నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









