మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!

- March 05, 2026 , by Maagulf
మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!

మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను మళ్లీ నిలిపివేశారు. ఈ మేరకు బహ్రెయిన్ విమానాశ్రయ కంపెనీ ప్రకటించింది.సివిల్ ఏవియేషన్ అఫైర్స్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇటీవల చిక్కుకుపోయిన వివిధ దేశాల ప్రయాణికులను కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించేందుకు పరిమిత సంఖ్యలో రిలీఫ్ ఫ్లైట్స్ ను అనుమతించిన విషయం తెలిసిందే.

కాగా, ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలను సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.  ప్రయాణీకులు తమ విమానాల స్టేటస్ ను విమానయాన సంస్థలు మరియు ఎయిర్ పోర్ట్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com