ఫోన్ లో కమలహాసన్ ను రజనీకాంత్ పరామర్శించారు..
- August 01, 2016
సినిమా ఇండస్ట్రీలో విశ్వనటుడు గా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ తెలుగు, హిందీ,తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చిన కమల్ తర్వాత హీరోగా ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. పద్మభూషణ్ కమల్ హాసన్ నటించిన పాత్రాల్లో ఆయనకు ఆయనే సాటి అనేలా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా దర్శకుడుగా..నృత్య దర్శకుడిగా అన్ని రంగాల్లో తనదైన స్టైల్ చూపించిన కమల్ హాసన్ రీసెంట్ గా షభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. ఈ మద్య కమల్ హాసన్ ఇంట్లో కాలు జారిపడటంతో తీవ్ర గాయాలు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నై మౌంటురోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న ఆయన కాలు మళ్లీ నొప్పిపుడుతుండటంతో వైద్యులు ఆదివారం మరోసారి ఆపరేషన్ చేశారు. ఇటీవలే అమెరికా నుంచి చెన్నై వచ్చిన హీరో రజనీకాంత్.. స్వయంగా కమల్ ను కలిసి పరామర్శించాలని భావించారు. అయితే రెండోసారి ఆపరేషన్ జరగడంతో అందుకు డాక్టర్లు అనుమతించలేదు. ఇక చేసేది లేక ఫోన్ లోనే కమలహాసన్ ను రజనీకాంత్ పరామర్శించారు. ఒకప్పుడు ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రాలు ఎన్నో అద్భుత విజయం సాధించాయి..ఈ ఇద్దరు చిత్రపరిశ్రమలో దర్శకులు కె.బాలచందర్ కి మంచి శిశ్యులని చెబుతారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







