మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- March 08, 2026
హైదరాబాద్: ప్రజాభవన్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలను ప్రభుత్వం ఇవాళ ఘనంగా నిర్వహించింది. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళల్ని ప్రభుత్వం సత్కరించింది.ఈ వేడుకల్లో సీఎం రేవంత్ స్వయంగా పాల్గొని ప్రసంగించారు.తెలంగాణ మహిళలు తయారుచేసే వస్తువులకు అమెజాన్లో అమ్మకానికి అవకాశం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం మహిళ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం కల్పించే అవకాశాలు అందిపుచ్చుకుని మహిళలు ఉన్నత స్థాయికి చేరాలి.
తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంది. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, స్పీకర్గా మహిళలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’ అని అన్నారు. త్వరలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం. మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. వారి కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. డ్వాక్రా సంఘాల ద్వారా రుణం అందిస్తున్నాం. గృహలక్షి పథకం ద్వారా సబ్సిడీకి గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తున్నాం ” అంటూ రేవంత్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!









