ఇకపై భారత్ రైళ్లలో ప్రయాణికుల కోసం 'కెఎఫ్సి' భోజనం
- July 22, 2015
ఐఆర్సీటీసీలో భోజనం నాసిరకంగా ఉంటోందంటూ చాలా కాలంగా ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు సమాధానంగా ఐఆర్సీటీసీ ఆధునిక సౌకర్యాలను అందిపుచ్చుకుంది. యుమ్ బ్రాండ్స్‌కు చెందిన ఫాస్ట్‌పుడ్ దిగ్గజం కెఎఫ్సి మీల్స్‌ను ఇక నుంచి రైల్వే ప్రయాణికులు రైళ్లలో ఆస్వాదించవచ్చు. రైళ్ళలో కెఎఫ్సి మీల్ ఆన్ బోర్డ్ సేవలందించేందుకు ఆ సంస్థ ఐఆర్‌సిటిసితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కెఎఫ్సి ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ-క్యాటరింగ్ సేవల కింద తమ మీల్‌కు ఆర్డర్ చేయవచ్చునని తెలిపారు. ప్రస్తుతానికి న్యూఢిల్లీ మీదుగా ప్రయాణించే పాంట్రీ కార్లు లేని 12 రైళ్లలోనే ప్రవేశపెట్టామన్నారు. రాబోయే పది రోజుల్లో విశాఖపట్నం, హైదరాబాద్ (కాచిగూడ), బెంగళూరు (యశ్వంత్‌పూర్) స్టేషన్ల నుంచి కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రైలులో కెఎఫ్సి భోజనం కావాలనుకునే వారు ఐఆర్సిటిసి వెబ్సైట్ ద్వారా లేదా 18001034139 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్న కస్టమర్ మొబైల్‌కు తాము ఒక పాస్వర్డ్ పంపుతామని, భోజనం సరఫరా చేసేందుకు వచ్చే వ్యక్తికి ఆ పాస్వర్డ్ చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైలు ప్రయాణికులకు మీల్స్‌ను అందించేందుకు గాను ఐఆర్సిటిసి, కెఎఫ్సి సంయుక్తంగా ఈ సర్వీసుని చేపట్టినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









