ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!

- March 11, 2026 , by Maagulf
ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!

మనామా: బహ్రెయిన్ నుండి పొరుగు దేశాలకు ప్రయాణానికి ఏవైనా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లతో తమకు సంబంధం లేదని బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.

కొన్ని ప్రైవేట్ పార్టీలు బహ్రెయిన్ నుండి వ్యక్తులను సమీప దేశాలకు ట్రాన్స్ పోర్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని రాయబార కార్యాలయం పేర్కొంది. అటువంటి ఏర్పాట్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని మరియు అలాంటి ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఆమోదించలేదని ఎంబసీ స్పష్టం చేసింది. 

ఈ ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాట్లు అధికారిక దౌత్య మార్గాలకు సంబంధం లేదని గుర్తించాలని రాయబార కార్యాలయం ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com