మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- March 13, 2026
రియాద్: మక్కా మరియు మదీనాలోని భవన యజమానులు లైసెన్స్ లేకుండా ఏదైనా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు చేపట్టవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యాలుగా మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన భవనాలకు మాత్రమే హజ్ సీజన్‌లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
రాబోయే హజ్ సీజన్‌కు సన్నాహకంగా అందించే ఆతిథ్య సేవల నాణ్యతను పెంచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మక్కా మరియు మదీనాలోని భవన యజమానులకు తాత్కాలిక వసతి సౌకర్యాల లైసెన్స్‌లను జారీ చేయడం ద్వారా యాత్రికుల వసతి రంగాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా హజ్ సీజన్‌లో పర్యాటక ఆతిథ్య సౌకర్యాలు తమ వసతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించే సర్వీసును కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే, ఈ సేవలు హజ్ సీజన్‌కు మాత్రమే పరిమితమని స్ఫష్టం చేసింది.
లైసెన్స్ లేకుండా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలను నిర్వహిస్తే SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









