కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!

- March 13, 2026 , by Maagulf
కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!

కువైట్: కువైట్ వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిసార్లు తేలికపాటి నుండి మితమైన గాలులు వీస్తాయని సంస్థ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు. పగటిపూట వాతావరణం తేలికపాటి నుండి వెచ్చగా మరియు రాత్రి చల్లగా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇక శనివారం వాతావరణ వేడిగా ఉంటుందని, మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఉష్ణోగ్రతలు 26°C మరియు 28°C మధ్య ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com