ఢిల్లీలో ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న మహిళ అరెస్ట్
- August 02, 2016
ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న ఓ ముస్లిం మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన 28 ఏళ్ళ యాస్మీన్ తన ఐదేళ్ళ కుమారుడితో కలిసి ఆదివారం కాబుల్ విమానం ఎక్కేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. భర్త నుంచి విడిపోయిన ఆమె నిజమైన ఇస్లాం జీవితం గడిపేందుకు ఐఎస్‌లో చేరాలని నిర్ణయించింది. గత నెల కేరళ నుంచి అదృశ్యమై ఐఎస్‌లో చేరినట్లు అనుమానిస్తున్న 21 బృందాన్ని కలిసేందుకు ఆఫ్గనిస్తాన్ వెళ్లే క్రమంలో యస్మీన్ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు అప్పగించగా కేరళ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను కేరళకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. యస్మీన్ను ప్రశ్నిస్తే కేరళ నుంచి అదృశ్యమైన 21 మంది ముస్లిం యువత సమాచారం తెలిసే అవకాశముందని కేరళ పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







