తితిదే పుష్కర యాత్ర ప్రారంభం కానుంది..

- August 02, 2016 , by Maagulf
తితిదే పుష్కర యాత్ర ప్రారంభం కానుంది..

తితిదే తరఫున కృష్ణా పుష్కర యాత్ర బుధవారం ఉదయం తిరుమల నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో తితిదే నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయంలో వివిధ రకాల కైంకర్యాలు నిర్వహించేందుకు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కల్యాణరథంలో తిరుమల నుంచి పుష్కరయాత్రగా తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయం, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం; కర్నూలు జిల్లా మహానంది ఆలయం, శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి ఆలయం; గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం మీదుగా విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి.. అక్కడి నుంచి అమరావతి మీదుగా శ్రీవారి నమూనా ఆలయానికి వేంచేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com