సినిమా రివ్యూ: ‘భగత్ సింగ్’!
- March 19, 2026
డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో సత్తా చాటుతూనే.. మరోవైపు సినిమాల్లో పవర్ స్టార్‌గా ఏమాత్రం తగ్గడం లేదు పవన్ కల్యాణ్. ‘ఓజీ’తో ఫ్యాన్స్‌లో పూనకాలు పెంచేసిన ఆయన ఇప్పుడు మళ్లీ ‘భగత్ సింగ్’గా తెరపై మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నారు. ఇంకేముంది.! అయిపోయిందంటే అయిపోయింది.. ఇప్పట్లో ఈ కాంబో పట్టాలెక్కే అవకాశాలే లేవ్.. అనుకున్న హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అనూహ్యంగా పట్టాలెక్కడం.. అలాగే, ఊహించని విధంగా అతి తక్కువ సమయంలోనే పూర్తయిపోవడం.. రిలీజ్‌కి రెడీ అయిపోవడం.. అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయ్. ఫైనల్లీ ‘భగత్ సింగ్’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి, ఆ అంచనాల్ని ‘భగత్ సింగ్’ ఎలా అందుకున్నాడు.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
నల్లమల అడవుల్లోని ఓ గిరిజన ప్రాంతం.. చదువు సంధ్యా తెలియని చిన్న పిల్లలు.. వారికి చదువు చెప్పి, బుద్ధిమతి నేర్పడానికి ఆ ఏజెన్సీ ప్రాంతానికి వస్తాడు పెద్దాయన చంద్రశేఖర్ రావు (కె.ఎస్.రవికుమార్) తన జీవితాన్నీ, జీతాన్నీ ఆ గూడెం పిల్లల కోసం, అక్కడి జనం కోసం త్యాగం చేస్తాడాయన. అదే గూడానికి చెందిన ఉస్తాద్ కొడుకును కూడా చేరదీస్తాడు. చిన్నతనంలోనే తన తల్లితండ్రుల్ని కోల్పోయిన ఆ కుర్రాడికి ఉస్తాద్ భగత్ సింగ్ అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పుతాడు. మాస్టారు గారి స్పూర్తితో అన్యాయాల్ని ఎదిరించే ఏసీపీగా ఎదుగుతాడు. పాతబస్తీలో ఏసీపీగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్‌కి.. అక్కడే అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వామి అయిన నల్ల నాగప్పతో వైరం ఏర్పడుతుంది. నల్ల నాగప్ప అరాచకాలకు అడుగడుగునా అడ్డు పడే భగత్ సింగ్‌ని తన ఇన్‌ఫ్లూయెన్స్‌తో సస్పెండ్ చేయిస్తాడు నల్ల నాగప్ప. ఈ క్రమంలో తాను పుట్టి పెరిగిన గూడానికి వెళ్లి అక్కడే తన మాస్టారు చదువు చెప్పిన స్కూల్‌లో పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. మరోవైపు గూడానికి మంచి చేసే మాస్టారు చంద్ర శేఖర్ సీఎం స్థాయికి ఎదుగుతాడు. అయితే, సీఎం కుర్చీపై కన్నేసిన నల్ల నాగప్ప.. చంద్ర శేఖర్ రావును అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు. దాంతో, మాస్టారును కాపాడుకోవడానికి మళ్లీ రంగంలోకి దూకిన భగత్ సింగ్, నల్ల నాగప్పను ఎలా ఎదుర్కొన్నాడు.? మాస్టారును ఎలా కాపాడుకున్నాడు. వెకేషన్ కోసం గూడానికి వచ్చిన శ్లోక (రాశీ ఖన్నా) ఎవరు.? ఆమెను నల్ల నాగప్ప ఎందుకు కిడ్నాప్ చేస్తాడు.? అలాగే లీల (శ్రీ లీల)కీ, భగత్ సింగ్‌కీ మధ్య వున్న బంధం ఏంటీ.? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పని తీరు:
టీజర్లు, ట్రైలర్లలో చూసినట్లుగానే చాలా చలాకీగా చాలా యాక్టివ్‌గా వింటేజ్ లుక్స్‌లో చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపించారు పవన్ కళ్యాణ్. అవును మరి, మీలో ఒకడు నాతో సినిమా తీస్తే ఎలా వుంటదో అలా వుంటది ఈ సినిమా అని ఆయన ముందే చెప్పారుగా. తన అభిమాన హీరోని తెరపై ఎలా చూసుకోవాలనుకుంటారో .. అలాగే పవన్ కళ్యాణ్‌ని చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. చాలా ఈజ్‌తో యాక్టివ్‌గా కనిపించారు స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్. రాశీ ఖన్నా పాత్రకు ఎక్కువ నిడివి కానీ, ఇంపార్టెన్స్ కానీ లేవు. కేవలం ప్రధమార్ధం వరకే పరిమితమైంది. వున్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది రాశీ ఖన్నా. ఈ సినిమాలో శ్రీలీలకు ప్రాధాన్యత వున్న పాత్ర దక్కింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి లవ్ సీన్స్, సరదా సన్నివేశాలూ బాగా కుదిరాయ్ శ్రీలీలకి. ‘ఈ మనసే..’ పాట కూడా బాగా సెట్ అయ్యింది. ఇంతవరకూ శ్రీలీల చేసిన సినిమాల్లో ఓవరాక్షన్ అనే ట్యాగ్ ఈ సినిమాతో పోతుందనిపిస్తుంది. సరదా సన్నివేశాలతో పాటూ, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లోనూ శ్రీలీల బాగా నటించింది. సెటిల్డ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. మరో సర్‌ప్రైజింగ్ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ సినిమాకి నల్ల నాగప్ప పాత్ర పోషించిన సీనియర్ తమిళ నటుడు పార్ధిబన్. మెయిన్ విలన్‌గా ఆయన తన పాత్రలో చాలా ప్రభావమే చూపించారు. అలాగే కె.ఎస్.రవికుమార్, రావు రామేష్, గౌతమి తదితరులు తమకు అలవాటైన పాత్రల్లో నటించి మెప్పించారు. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రల్లో పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి కథ, కథనాల గురించి పెద్దగా మాట్లాడుకునే అవకాశం లేదు. ఎందుకంటే.. హీరోగా పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్.. అలాగే బలమైన సంభాషణలు, ఎలివేషన్లతో ఆలోచన పక్కకు తీప్పుకోనీయకుండా చేశాడు తన స్టైల్ ఫక్తు కమర్షియల్ అంశాలతో హరీష్ శంకర్. రైటింగ్ టీమ్ వర్క్ ఎక్స్‌లెంట్ ఈ విషయంలో అని చెప్పక తప్పదు. అలాగే, డిప్యూటీ సీఎం.. అనే హోదాకి ఎక్కడా భంగం కలగనీయకుండా చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాన్ నుంచి అవుట్ పుట్ తీసుకొచ్చాడు. ఫస్టాఫ్ సో సోగా నడిచిపోయినా.. సెకండాఫ్‌లో మాత్రం భావోద్వేగాలతో అవసరమైన చోట మంచి చెప్పే అవకాశమున్న చోట అస్సలు ఊరుకోలేదు. డిప్రెషన్, సోషల్ మీడియా ఎఫెక్ట్.. దేశభక్తి.. ఇలా కొన్ని సున్నితమైన అంశాలను అంతే సున్నితంగా సోషల్ రెస్పాన్సిబులిటీని దృష్టిలో పెట్టుకుని రాయించిన డైలాగులు తెరకెక్కించిన సన్నివేశాలు కనెక్ట్ అవుతాయ్. పతాక సన్నివేశాలు నెక్స్‌ట్ లెవల్. ఓ వైపు సరదా సరదా ఎంటర్‌టైన్‌మెంట్ అనిపిస్తూనే మరో వైపు ఆసక్తిగా కథనాన్ని నడిపించేశాడు హరీష్ శంకర్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయ్. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. సంభాషణలు బాగున్నాయ్. ఆనంద్ సాయి ఆర్ట్ వర్క్ సూపర్బ్. సినిమాటోగ్రపీ, నిర్మాణ విలువలు.. అన్నీ సూపర్బ్. చాలా తక్కువ టైమ్ అయినా.. చాలా హార్డ్ వర్క్‌తో డెడికేటెడ్‌గా ఈ ప్రాజెక్ట్‌ని పూర్తి చేసిన వైనం తెరపై సుస్పష్టంగా కనిపిస్తుంది. సాంకేతిక వర్గం ఫుల్ టీమ్ సపోర్ట్‌కి హ్యాట్సాఫ్.!
ప్లస్ పాయింట్స్:
పవన్ కళ్యాణ్, సంభాషణలు, భావోద్వేగాలు, సోషల్ మెసేజ్‌లు, ఎక్స్‌ట్రా..
మైనస్ పాయింట్స్:
మైనస్ అనలేం కానీ, కథలో కొత్త దనం లేకపోవడం (అది ఆశించకపోవడమే బెటర్).
చివరిగా:
‘ఉస్తాద్ భగత్ సింగ్’.. షార్ట్ టైమ్ బెస్ట్ అవుట్ పుట్.! ఫ్యాన్స్ ఖాతాలో మరో ‘పవర్’ బ్లాక్ బస్టర్.! ‘ఉగాది’ పండగ.. కాదు కాదు ‘ఉస్తాద్’ పండగ.!
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









