ఎంసెట్‌-3 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది

- August 02, 2016 , by Maagulf
ఎంసెట్‌-3 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది

ఎంసెట్‌-3 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 11న ఎంసెట్‌-3 పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎంసెట్‌-3 కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ యాదయ్యను నియమించారు. పరీక్షకు సంబంధించిన అనంతరం ఇతర అంశాలపై ప్రొఫెసర్ యాదయ్య ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.అయితే టీఎస్ ఎంసెట్-3 కోసం విద్యార్థులు అదనపు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఎంసెట్-2 కు హాజరైన హాల్ టికెట్లతోనే పరీక్షా కేంద్రాలకు హాజరుకావచ్చని తెలుస్తోంది. కేవలం పరీక్షకు విద్యార్థులు సన్నద్దమైతే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దని పరీక్ష సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎంసెట్-2 పేపర్ లీక్ అయిన కారణంగానే ఎంసెట్-3కి నిర్ణయం తీసుకున్నామని ప్రకటించిన కేసీఆర్... విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.ఎంసెట్-3 కోసం ఎంసెట్-2 అభ్యర్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన కేసీఆర్... ఎంసెట్-2 హాల్ టికెట్లతోనే వారు ఎంసెట్-3కి హాజరు కావొచ్చని సూచించారు. ఎంసెట్- 2 రాసిన విద్యార్థులకు కొత్తగా నిర్వహిస్తున్న ఎంసెట్- 3కి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కొత్తగా ఎంసెట్ పరీక్ష రాయాలనుకునే వారు మాత్రమే ఎంసెట్-3 కి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇక ఎంసెట్- 2 రాసిన విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే దిశగా ఎంసెట్-3 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com