మనోజ్ ఒక ఉద్యమకారుడి పాత్రలో...

- August 02, 2016 , by Maagulf
మనోజ్ ఒక ఉద్యమకారుడి పాత్రలో...

శరవేగంగా సినిమాలు పూర్తిచేస్తూ ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టును వెంటవెంటనే ఓకే చేస్తున్న మంచుమనోజ్ తాజాగా చేస్తున్న సినిమా గురించిన విశేషాలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రతో మనోజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.'ఒక్కడు మిగిలాడు' అనే టైటిల్‌తో అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఒక ఉద్యమకారుడి పాత్రను పోషిస్తున్నట్లు సినిమా ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో తాను చాలా బరువైన, ఎమోషనల్ పాత్రను పోషిస్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. మనోజ్ సరసన రెజీనా చేస్తున్న ఈ సినిమాలో ఇంకా.. అజయ్, జెన్నీ, అల్లు రమేష్, భారతీరావు, ప్రేమిక తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వీకే రామరాజు, సంగీతం: శివ ఆర్. నందిగం, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, కాస్ట్యూమ్స్: నీరజా కోన, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు: ఎస్ఎన్ ఎడ్డి, లక్ష్మీకాంత్. అచ్చిబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇది కాక.. 'నా రాకుమారుడు' ఫేమ్ ఎస్.కె.సత్య దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఈ సొట్టబుగ్గల చిన్నోడు అంగీకరించాడు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com