బాటెల్కో సూపర్‌ ఫాస్ట్‌ ఫైబర్‌ నెట్‌

- August 02, 2016 , by Maagulf
బాటెల్కో సూపర్‌ ఫాస్ట్‌ ఫైబర్‌ నెట్‌

500 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో రెసిడెన్షియల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఇంటర్నెట్‌ ప్యాకేజీని బహ్రెయిన్‌లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ రంగంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా బాటెల్కో రికార్డులకెక్కిందని కంపెనీ వర్గాలు వివరించాయి. సూపర్‌ ఫాస్ట్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ ప్యాకేజ్‌, కుటుంబమంతటికీ ఇంటర్నెట్‌ వినియోగాన్ని సులభతరం చేస్తుందని బాటెల్కో ప్రతినిథులు చెప్పారు. బాటెల్కో సూపర్‌ ఫాస్ట్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ 500 ఎంబీపీఎస్‌ ప్యాకేజ్‌లో 50 ఎంబీ అప్‌లోడ్‌ స్పీడ్‌ మరియు 1 టిబి యూసేజ్‌ లిమిట్‌ ఉంటుంది. ఈ ప్యాకేజీలో అన్‌లిమిటెడ్‌ బ్రౌజింగ్‌, యూట్యూబ్‌ స్ట్రీమింగ్‌, ఉచిత వారాంతపు వినియోగం వంటివి కూడా ఉంటాయి. హోమ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ప్యాకేజీల విస్తరణలో భాగంగా ఈ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు బాటెల్కో బహ్రెయిన్‌ సీఈఓ మునా అల్‌ హషెమి చెప్పారు. ప్రస్తుతం వేరే ప్యాకేజీల్లో ఉన్న బాటెల్కో వినియోగదారులు, కొత్త ప్యాకేజీలోకి సులభంగా అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com