భారతీయ కార్మికులకు పూర్తి గ్యారంటీ
- August 02, 2016
ది స్టేట్ ఆఫ్ కువైట్, ఫారిన్ కమ్యూనిటీస్‌కి పూర్తిస్థాయి గ్యారంటీ ఇవ్వడానికి సుముఖంగా ఉంటుందని మినిస్టర్ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్ చెప్పారు. దేశంలో ఎక్కువగా ఉన్న ఇండియా కమ్యూనిటీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ హింద్ అల్ సబీ వివరించారు. కువైట్‌లోని ప్రైవేట్ సెక్టార్‌లో 549,196 భారతీయ వలస కార్మికులు పనిచేస్తున్నట్లు చెప్పిన మినిస్టర్ డాక్టర్ హింద్ అల్ సబీ, 2015 జులై 31 నుంచి జులై 31, 2016 మధ్యలో కేవలం 4,223 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని చెప్పారు. ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చిన వెంటనే వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్న మినిస్టర్, ఎక్కువగా చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదులే వస్తాయని అన్నారు. భారత ప్రభుత్వం తరఫున ఎక్స్‌టర్నల్ ఎఫైర్స్ సహాయ మంత్రి అక్బర్, కువైట్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఖాలిద్ సులైమాన్ అల్ జరాల్లాతో ఫోన్‌లో పలు అంశాలపై చర్చించారు. కువైట్‌లో భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే, ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. కువైట్‌లో పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి అక్బర్‌ని ప్రత్యేకంగా నియమించినట్లు భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా ఇటీవలే వెల్లడించారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







