సిరియాలో కెమికల్ దాడులు...
- August 03, 2016
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వైమానిక దాడులు జరుపుతున్న దేశాలు రసాయనికదాడులకు దిగుతున్నాయా.. అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇటీవల రష్యాకు చెందిన ఎమ్-8 హెలికాప్టర్ ను సిరియాలో కూల్చివేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన అనంతరం రెండు కెమికల్ దాడులు జరిగాయని, ఈ దాడులకు పాల్పడింది రష్యానే అనే విమర్శలు వినిపిస్తున్నాయి.క్లోరిన్ గ్యాస్ తో కూడిన గ్యాస్ సిలిండర్ లను ఇడ్లిబ్ ప్రావిన్సులోని సారాకెబ్ లో జనావాసప్రాంతాల్లో విడిచారని 'ఇడ్లిబ్ సివిల్ డిఫెన్స్' తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించింది. మరో ఘటనలో.. మంగళవారం అలెప్పోలో జరిగిన రసాయనిక దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారని సిటీ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ హజౌరీ మీడియాతో వెల్లడించారు. అయితే.. ఉగ్రవాదులు రసాయనిక దాడులకు పాల్పడ్డారంటూ సిరియా ప్రభుత్వ వర్గాలు ఓ ప్రకటనను విడుదలచేశాయి. రష్యా సైతం రసాయనిక దాడుల ఆరోపణలను తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







