సుజనా ఇంటి ముందు వీధిని చీపుర్లతో వూడ్చి నిరసన...
- August 03, 2016
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలోని కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో సుజనాచౌదరి సరిగా స్పందించకుండా మంత్రి పదవిని కాపాడుకునేందుకు భాజపాతో కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుజనా ఇంటి ముందు వీధిని చీపుర్లతో వూడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక తెదేపా నాయకులు సోనియాగాంధీ డౌన్.. డౌన్, రాష్ట్ర విభజనకు సోనియానే కారణమంటూ నినాదాలు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను శాంతింపజేసి నిరసన విరమింపజేశారు.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







