మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- March 23, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగర జనాభా మరియు వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో ప్రకటించారు. ఇందులో భాగంగా నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు.
ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు భారీ ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ సంస్థ ముందుకు రాకపోవడంతో, కేంద్ర నిబంధనల ప్రకారం రూ. 15 వేల కోట్లతో మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. త్వరలోనే మరో 76 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లను విస్తరించబోతున్నట్లు సీఎం భరోసా ఇచ్చారు.

నగర సుందరీకరణలో భాగంగా మూసీ నది పునరుజ్జీవనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మూసీని గత వైభవానికి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. దీనితో పాటు, దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, గతంలో గుజరాత్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు ఎలాగైతే కలిశాయో, హైదరాబాద్ అభివృద్ధి కోసం కూడా ప్రతిపక్షాలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?