ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ.....
- August 03, 2016
తెలంగాణ ప్రభుత్వం మరోసారి కొలువుల జాతరకు తెరతీసింది. విడతల వారీగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం ఈసారి భారీ ప్రకటనే విడుదల చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 1794 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 1164 పోస్టులను భర్తీ చేయనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా ప్రకటనను ప్రభుత్వం వెలువరించింది.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







