తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియా..
- August 03, 2016
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నిన్న వారణాసిలో రోడ్ షో చేస్తున్న ఆమె అనారోగ్యం కారణంగా షోను మధ్యలోనే ఆపేసి చార్టర్డ్ విమానంలో అర్ధరాత్రి సమయంలో దిల్లీ చేరుకుని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె కోలుకుంటున్నారని కాంగ్రెస్ మీడియా సెల్ ఇంఛార్జి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. సోనియా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమె రోడ్ షో కారణంగా డీహైడ్రేషన్‌కి గురయ్యారని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







