ప్రేగులలో హెరాయిన్ గుళికలను దాచుకొన్న స్మగ్లర్ అరెస్ట్

- August 03, 2016 , by Maagulf
ప్రేగులలో  హెరాయిన్ గుళికలను దాచుకొన్న స్మగ్లర్  అరెస్ట్

రాస్ అల్ ఖైమాహ్:  ఎమిరేట్ సరిహద్దు వద్ద ఎనిమిది హెరాయిన్ గుళికలను  అక్రమంగా ప్రయత్నిస్తున్న స్మగ్లర్లను రాస్ అల్ ఖైమాహ్ (రాక్ ) పోలీసులు పట్టుకున్నట్లు  మంగళవారం తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి  తన కడుపులోని  ప్రేగులలో  ఎనిమిది హెరాయిన్ గుళికలను దాచి  అక్రమంగా వాటిని తరలించే యత్నంలో రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ విభాగంలో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ కు దొరికిపోవడంతో అతని పధకం  పూర్తి కాకా ముందే అరెస్టు కాబడినట్లు  తెలిపారు.రాస్ అల్ ఖైమాహ్ పోలీస్  మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ ఆలీ అల్ జాబి  ఒక ప్రకటనలో తెలిపారు. ఒక ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి  తన స్వదేశం నుండి అక్రమ మాదక ద్రవ్యాలను తన కడుపులో దాచుకొని రహస్యంగా తమ దేశంలోకి వస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో ఒక చిన్న కిటుకతో స్మగ్లరుని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఈ స్మగ్లరుని పట్టుకోవడానికి ఒక జట్టుని నియమించి అతని కదలికలపై పూర్తి నిఘా పెట్టినట్లు వివరిస్తూ, ఆ నిర్దిష్ట ఆసియా దేశం సరిహద్దు ప్రాంతం నుంచి జట్టులోని పోలీస్ అధికారులని నియంత్రిస్తూ చివరకు స్మగ్లరుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులని చూడగానే మాదక ద్రవ్యాల గుళికలు అక్రమ రవాణా చేసే వ్యక్తి  భయంతో తన కడుపులో ఉన్న గుళికల గూర్చి వివరించాడు   వెంటనే తన నేరాన్ని అంగీకరించాడు.ఆసియా దేశానికి చెందిన ఆ స్మగ్లర్  ప్రేగులు నుంచి మాదక ద్రవ్యాన్ని సేకరించేందుకు ఆసుపత్రికి పంపారు. ఆ తర్వాత అతని పొట్టలోంచి ఎనిమిది హెరాయిన్ గుళికలను తీయగా ఆ మొత్తం  51.6 గ్రాముల బరువు  కలిగిన ఉందని  కల్ అల్ జాబి  చెప్పారు. ఈ  కేసుని  పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు బదిలీ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com