ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్ జలాల్లోకి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం..
- August 03, 2016
ఉత్తరకొరియా తొలిసారిగా జపాన్ జలాల్లోకి ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్ మిస్సైల్)ని ప్రయోగించింది. నేరుగా జపాన్ నియంత్రణలోని జలాల్లోకి క్షిపణి ప్రయోగించడంతో జపాన్ నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కొరియా చర్యలతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు.. ఉత్తరకొరియాకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉ.కొరియా రెండు ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణులను ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగించింది. అయితే అందులో ఒకటి టేకాఫ్ సమయంలోనే పేలిపోయినట్లు తెలిసిందని అమెరికా సైన్యం వెల్లడించింది.
దక్షిణ కొరియాలో అమెరికా క్షిపణి వ్యతిరేక సిస్టమ్ ఏర్పాటు చేసి.. అమెరికా, ద.కొరియా సైన్యాలు సంయుక్తంగా మిలిటరీ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఉ.కొరియా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. కొరియా ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడిందని.. జపాన్ ఉత్తర తీరానికి 250కిలోమీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోందని జపాన్ వెల్లడించింది. ఇది తమ దేశ భద్రతకు తీవ్రంగా ఆటంకం కలిగించే అంశమని జపాన్ ప్రధాని షింజో అబే ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమన్నారు. ఉ.కొరియా చర్యలను అమెరికా ఖండించింది. బాలిస్టిక్ క్షిపణి టెక్నాలజీ ఉపయోగిస్తూ ఐరాస భద్రతా మండలి నిబంధనలను ఆ దేశం పూర్తిగా ఉల్లంఘిస్తోందని పేర్కొంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







