కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!

- March 24, 2026 , by Maagulf
కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!

కువైట్: కువైట్ లో పలు ప్రాంతాల్లోని ఏడు ఓవర్‌హెడ్ విద్యుత్ ప్రసార లైన్లు సేవలకు దూరమయ్యాయని విద్యుత్, జల మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వైమానిక రక్షణ నిరోధక చర్యల కారణంగా పడిన శిథిలాల వల్ల ఈ ఘటనలు జరిగాయని తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో పాక్షిక విద్యుత్ అంతరాయాలు నమోదయ్యాయని, అత్యవసర రెస్పాన్స్ టీమ్స్ పరిస్థితిను పర్యవేక్షించాయని, వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించామని అధికార ప్రతినిధి, ఇంజనీర్ ఫాతిమా జవహర్ హయత్ ఒక ప్రకటనలో తెలిపారు.  

విద్యుత్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి, నిరంతర సేవలను అందించేందుకు అత్యవసర బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని హయత్ చెప్పారు. అధికార వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com