సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!

- March 24, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!

రియాద్: సౌదీ అరేబియాలో ఈ వీకెండ్ వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం దని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. నివాసితులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని, లోయల వంటి వరద ముప్పు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. మీడియా, అధికారిక సోషల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జారీ చేసిన భద్రతా సూచనలను ఫాలో కావాలని కోరింది. 

మక్కా, రియాద్, తబూక్, అల్-జౌఫ్, హైల్, ఉత్తర సరిహద్దులు, మదీనా, అల్-బహా, అసిర్, జాజాన్, నజ్రాన్, ఖాసిం మరియు తూర్పు ప్రావిన్స్‌తో సహా పలు ప్రాంతాలలో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  

అరేబియా ద్వీపకల్పంపై వెచ్చని ఉపరితల గాలి, చల్లని ఎగువ-స్థాయి ద్రోణుల పరస్పర చర్య కారణంగా ఉరుములు, భారీ వర్షాలు మరియు వడగళ్ల వానలకు దారితీస్తుందని జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.   

ఈద్ సందర్భంగా అసిర్‌లో అత్యధిక వర్షపాతం

పర్యావరణ, జల మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం,  గత వారాంతంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. తొమ్మిది ప్రాంతాలలోని 63 పర్యవేక్షణ కేంద్రాలు వర్షపాతాన్ని నమోదు చేశాయి. అసిర్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అభా విమానాశ్రయంలో 52 మిల్లీమీటర్లు, బల్కార్న్‌లోని అల్-ఫవ్హాలో 50.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  ఎత్తైన మరియు మైదాన ప్రాంతాలు వర్షం, వడగళ్లు మరియు దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉన్నాయని తెలిపింది. అసిర్‌లో కురిసిన వర్షం, ఈద్ వేడుకలకు ఒక గమ్యస్థానంగా ఆ ప్రాంత ఆకర్షణను మరింత పెంచిందని పేర్కొంది.

రియాద్ ప్రాంతంలోని అల్-అఫ్లాజ్‌లో 14.2 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా, తూర్పు ప్రావిన్స్‌లోని బల్జురాషీ, అల్-బహాలోని అల్-ముహమ్మదియాలో 11.2 మిల్లీమీటర్లు, మరియు యాబ్రిన్‌లో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్-బహా మరియు ఉత్తర ప్రాంతాలలో వడగళ్ళతో కూడిన భారీ వర్షాలు కురిసాయి.

నైరుతి అల్-బహా ప్రాంతంలో భారీ వర్షం, వడగళ్ళ కారణంగా కొద్దిసేపు శీతాకాలం వంటి వాతావరణం ఏర్పడింది. అధికారులు పరిస్థితులను పర్యవేక్షించారు. వరద కాలువలకు, నీరు నిలిచి ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలను కోరారు. ఇంకా ఉత్తరాన, హైల్ నగరం మరియు దాని చుట్టుపక్కల గవర్నరేట్‌లలో మోస్తరు వర్షపాతం నమోదైంది. దీంతో స్థానిక లోయలు, వాగులు పొంగిపొర్లాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com