వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!

- March 24, 2026 , by Maagulf
వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!

మస్కట్: ధంక్ విలాయత్‌లోని ఒక వాగులో వాహనంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన అత్యవసర కాల్ కు అల్ ధాహిరా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ యూనిట్ రెస్క్యూ బృందాలు స్పందించాయి. ఆ ముగ్గురినీ విజయవంతంగా రక్షించారు. వారు క్షేమంగా ఉన్నారని సీడీఏఏ తెలిపింది.

ఈశాన్యం వైపు కదులుతున్న తుఫాన్

అల్ ధాహిరా గవర్నరేట్‌పై విస్తరించి ఉన్న తుఫాను క్రమంగా ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అల్ దఖిలియా గవర్నరేట్, దక్షిణ అల్ బతినా గవర్నరేట్, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ మరియు మస్కట్ గవర్నరేట్‌ లలో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.  నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక భద్రతా సూచనలను పాటించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com