ప్రేగులలో హెరాయిన్ గుళికలను దాచుకొన్న స్మగ్లర్ అరెస్ట్
- August 03, 2016
రాస్ అల్ ఖైమాహ్: ఎమిరేట్ సరిహద్దు వద్ద ఎనిమిది హెరాయిన్ గుళికలను అక్రమంగా ప్రయత్నిస్తున్న స్మగ్లర్లను రాస్ అల్ ఖైమాహ్ (రాక్ ) పోలీసులు పట్టుకున్నట్లు మంగళవారం తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి తన కడుపులోని ప్రేగులలో ఎనిమిది హెరాయిన్ గుళికలను దాచి అక్రమంగా వాటిని తరలించే యత్నంలో రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ విభాగంలో మాదక ద్రవ్యాల నిరోధక శాఖ కు దొరికిపోవడంతో అతని పధకం పూర్తి కాకా ముందే అరెస్టు కాబడినట్లు తెలిపారు.రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగ డైరెక్టర్ జనరల్ కల్నల్ అద్నాన్ ఆలీ అల్ జాబి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి తన స్వదేశం నుండి అక్రమ మాదక ద్రవ్యాలను తన కడుపులో దాచుకొని రహస్యంగా తమ దేశంలోకి వస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో ఒక చిన్న కిటుకతో స్మగ్లరుని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఈ స్మగ్లరుని పట్టుకోవడానికి ఒక జట్టుని నియమించి అతని కదలికలపై పూర్తి నిఘా పెట్టినట్లు వివరిస్తూ, ఆ నిర్దిష్ట ఆసియా దేశం సరిహద్దు ప్రాంతం నుంచి జట్టులోని పోలీస్ అధికారులని నియంత్రిస్తూ చివరకు స్మగ్లరుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులని చూడగానే మాదక ద్రవ్యాల గుళికలు అక్రమ రవాణా చేసే వ్యక్తి భయంతో తన కడుపులో ఉన్న గుళికల గూర్చి వివరించాడు వెంటనే తన నేరాన్ని అంగీకరించాడు.ఆసియా దేశానికి చెందిన ఆ స్మగ్లర్ ప్రేగులు నుంచి మాదక ద్రవ్యాన్ని సేకరించేందుకు ఆసుపత్రికి పంపారు. ఆ తర్వాత అతని పొట్టలోంచి ఎనిమిది హెరాయిన్ గుళికలను తీయగా ఆ మొత్తం 51.6 గ్రాముల బరువు కలిగిన ఉందని కల్ అల్ జాబి చెప్పారు. ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వద్దకు బదిలీ చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







