బహ్రెయిన్‌ లో యూఏఈ సైనికుడు మృతి..!!

- March 25, 2026 , by Maagulf
బహ్రెయిన్‌ లో యూఏఈ సైనికుడు మృతి..!!

మనామా: ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల సమయంలో బహ్రెయిన్ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న యూఏఈ సాయుధ దళాల సైనికుడు ఒకరు మరణించారని బహ్రెయిన్ రక్షణ దళం (బీడీఎఫ్)  తెలిపింది. ఈ దాడులలో యూఏఈ సహచరులతో పాటు తమ సిబ్బందిలో పలువురు గాయపడ్డారని బీడీఎఫ్ పేర్కొంది. వారిని చికిత్స కోసం  తరలించినట్టు తెలిపింది.

యూఏఈ సైనికుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, యూఏఈ సాయుధ దళాలకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది జనరల్ కమాండ్ . బహ్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి, అలాగే ప్రజల భద్రత, స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com