ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!

- March 25, 2026 , by Maagulf
ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!

అల్ ధాహిరా: ఇబ్రి విలాయత్‌లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ విభాగాలకు చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు, పౌరులు మరియు నివాసితులందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పాస్‌పోర్ట్, పౌర స్థితి (Civil Status) మరియు ట్రాఫిక్ సంబంధిత సేవా కేంద్రాల కార్యకలాపాలను నిలివేస్తూ ఒమన్ పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా మరియు ధోఫార్ లలో  ఈ సేవలు యథావిధిగా కొనసాగాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com