ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- March 26, 2026
హైదరాబాద్: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.ఎంఎంటీఎస్ సర్వీసులపై శానసమండలి హాల్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. కార్యాలయాల సమయాల్లో ఎంఎంటీఎస్‌ల సంఖ్య పెంచడంతో పాటు క్రమంతప్పకుండా సమయ పాలన పాటిస్తూ సర్వీసులు నడపాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు అవకాశం లేకపోవడం, స్టేషన్లు లోపలికి ఉన్నందున అక్కడకు రాకపోకలు సాగించేందుకు వీలుగా మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. ఎంఎంటీఎస్ స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మెరుగైన వసతులు ఉన్నప్పుడే ప్రయాణికులు ఎంఎంటీఎస్ వైపు మొగ్గు చూపుతారని సీఎం తెలిపారు. స్వీయ ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచించారు.లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంపు.. వసతులు మెరుగుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.సమీక్షలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్,ఆర్ అండ్ బీ వికాస్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హెచ్‌యూఎంటీఏ ఎండీ జీవన్ బాబు, దక్షిణ మధ్య రైల్వే డీసీఎం చరణ్ నాయక్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!









