దుబాయ్‌ హాస్పిటల్‌లో హ్యాపీనెస్‌ సెంటర్‌

- August 03, 2016 , by Maagulf
దుబాయ్‌ హాస్పిటల్‌లో హ్యాపీనెస్‌ సెంటర్‌

లతీఫా హాస్పిటల్‌లో హ్యాపీనెస్‌ సెంటర్‌ని దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ చైర్మన్‌ మరియు బోర్డ్‌ అండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ హుమైద్‌ అల్‌ ఖాతిమి ప్రారంభించారు. వినియోగదారులకు అత్యున్నతస్థాయిలో సేవలు అందించడమే ఈ హ్యాపీనెస్‌ సెంటర్‌ లక్ష్యమని నిర్వాహకులు తెలపపిఆరు. రోజుకి 400 మంది వినియోగదారులకు సేవలందించడం ఈ హ్యాపీనెస్‌ సెంటర్‌ లక్ష్యం. బర్త్‌ సర్టిఫికెట్లు, హెల్త్‌ కార్డ్స్‌, మెడికల్‌ రిపోర్ట్స్‌, అపాయింట్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌, బుకింగ్‌, ఫార్మసీ సర్వీసెస్‌, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ నజూూష్ట్ర్య బోర్న్స్‌ వంటి సేవలు ఇక్కడ అందుతాయి. అల్‌ ఖాతిమి ఈ సందర్భంగా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ మరియు ఫారిన్‌ ఎఫైర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనీ, నిపుణులైనవారితో ఈ సర్వీసులు నిర్వహించబడ్తాయని, వీలైనంత త్వరగా ఆయా సర్వీసులు అందించేలా ఏర్పాట్లు చేశామని లతీఫా హాస్పిటల్‌ సీఈఓ డాక్టర్‌ మోనా తహల్క్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com