ఇండియన్ మీడియా రిపోర్ట్స్‌కి ఖండన
- August 03, 2016
సౌదీ అరేబియాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, అతి కొద్ది సంస్థల చేసిన తప్పిదాలతో మొత్తం దుబాయ్‌లో అన్ని సంస్థలకూ ఆ తప్పులను ఆస్వాదించరాదని సౌదీలోని ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిథులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల మూసివేతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే అయినప్పటికీ, మిగతావారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని అక్తర్ ఉల్ ఇస్లామ్ సిద్దికి అనే ఎన్ఆర్ఐ బిజినెస్‌మేన్ చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ మీడియాలో అత్యుత్సాహంతో కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కింగ్‌ఫిషర్, సహారా వంటి సంస్థలు ఇండియాలో బిచాణా ఎత్తేస్తే వాటి గురించి ఇండియన్ మీడియా ఇంతలా ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నించారాయన. ఇప్పటికీ సౌదీ అరేబియా నుంచి ఇండియాకి పెద్దయెత్తున మనీ ట్రాన్స్ఫర్ అవుతోందనీ, ఇక్కడి కమ్యూనిటీకి ఇబ్బందులుంటే అదెలా సాధ్యమవుతుందని మీడియాలో పనిచేస్తున్న మోజిబ్ సిద్దికి అనే వ్యక్తి ప్రశ్నించారు. కొన్ని సంస్థలు లే ఆఫ్ వర్కర్స్‌ని ప్రకటించడం ఇదే కొత్త కాదని సౌదీ అరేబియాలో భారతీయ కమ్యూనిటీకి చెందినవారు వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







