సార్క్ సమావేశాల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్ చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్
- August 03, 2016
పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్ చేరుకున్నారు. అక్కడ జరగనున్న సార్క్ సమావేశాల్లో పాల్గొనడానికి రాజ్‌నాథ్ వెళ్లిన సంగతి తెలిసిందే. రేపు ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోంశాఖ మంత్రులు సమావేశమై చర్చలు జరపనున్నారు. దక్షిణాసియా దేశాల్లో ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపై అర్థవంతమైన సహకారం కోసం ప్రయత్నిస్తానని రాజ్‌నాథ్ పర్యటనకు బయలుదేరే ముందు స్పష్టంచేశారు. దేశాల భద్రతకు సంబంధించి చర్చించడానికి ఈ సమావేశాలు మంచి వేదిక అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్‌లో దాడులకు పాల్పడుతున్న పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే-మొహమ్మద్‌ల గురించి రాజ్‌నాథ్ ఈ చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







