గవర్నర్ కి రాజీనామా సమర్పించిన ఆనందీబెన్ పటేల్
- August 03, 2016
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాలను ఈరోజు రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లికి సమర్పించారు. తనకు త్వరలో 75 సంవత్సరాలు రాబోతున్నందున రాజీనామాకు అనుమతివ్వాలని ఆనందీబెన్ కోరిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థనను భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదించడంతో అధికారికంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా రేసులో ఉన్నారనే వార్తలను భాజపా కొట్టిపడేసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరితో చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నట్లు తెలిపింది.
సీఎం రేసులో ఆరోగ్య మంత్రి నితిన్ భాయ్ పటేల్, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ రూపానీ, కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాల, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి భిక్షూభాయ్ దాల్సానియా, గిరిజనుడు అయిన శాసనసభ స్పీకర్ గణ్‌పత్ వాసవ ఉన్నారు. భాజపాకు కంచుకోట అయిన గుజరాత్లో ప్రస్తుతం పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళన, గోరక్ష పేరుతో హిందూ అతివాద శక్తులు దళితులపై చేసిన దాడుల పట్ల నిరసన ఆందోళనలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే నేత ఇప్పుడు ఆ రాష్ట్రానికి కావాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







